Mon Dec 23 2024 14:50:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఆర్ఓ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దుర్గంబాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతుకోసి..
మంచిర్యాల : తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు దుర్గంబాబు (50) కొత్తపల్లి వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దుర్గంబాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతుకోసి పరారయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు.. రక్తపు మడుగులో పడిఉన్న దుర్గంబాబును చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే దుర్గంబాబు మరణించాడు. పోలీసులు ఘటనా ప్రాతంలో ప్రాథమిక ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుర్గంబాబు హత్యపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజులుగా దుర్గంబాబును చంపేస్తానని బెదిస్తున్నాడని, దీనిపా స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు హతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తే దుర్గంబాబును హతమార్చాడా ? లేక రెవెన్యూ అధికారుల గొడవలతో ఈ హత్య జరిగిందా ? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story