Mon Dec 23 2024 04:24:37 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థినికి లైంగిక వేధింపులు.. కోఠి ఉమెన్స్ కాలేజీ లెక్చరర్ అరెస్ట్
కరీంనగర్ ఓయూలో పీజీ చదువుతున్న విద్యార్థినిని కోఠి ఉమెన్స్ కాలేజీలో సంస్కృతం బోధించే అధ్యాపకుడు
కరీంనగర్ : చదివే స్కూలు, కాలేజీ మొదలు.. పనిచేసే సంస్థ, ప్రదేశం ఏదైనా సరే ఆడపిల్లలు, మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎందరికి శిక్షలు వేసినా, ఎన్ని కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహించినా.. వావి వరసలు లేకుండా.. ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నారు. నెలల పిల్లల నుంచి పండు ముసలి వరకూ ఎవరినీ వదలడం లేదు. తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ విద్యార్థినిని లైంగిక వేధించినందుకు ఓ లెక్చరర్ ను అరెస్ట్ చేశారు.
కరీంనగర్ ఓయూలో పీజీ చదువుతున్న విద్యార్థినిని కోఠి ఉమెన్స్ కాలేజీలో సంస్కృతం బోధించే అధ్యాపకుడు ఆదిత్య భరద్వాజ ఆన్ లైన్ లో వేధింపులకు గురిచేశాడు. దాంతో విద్యార్థిని గంగాధర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లెక్చరర్ ఆదిత్యను వనపర్తిలో అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. ఆదిత్యను విచారణ చేసిన అనంతరం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story