Mon Dec 23 2024 01:03:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు.. జంటహత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. భార్యను అత్తను హత్య చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు ఉరిశిక్ష విధించారు
కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. భార్యను అత్తను హత్య చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు ఉరిశిక్ష విధించారు. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదును విధిస్తూ కర్నూలు జిల్లా అదనపు జడ్జి తీర్పు చెప్పారు. శ్రవణ్ కుమార్ కు హత్య చేయడానికి సహకరించిన తండ్రి వరప్రసాద్ కు ఉరిశిక్ష, తల్లి కృష్ణవేణికి యావజ్జీవం విధిస్తూ తీర్పు చెప్పింది.
ఏడాదిలోపే విచారణ...
ఏడాదిలోపే విచారణ ముగించి ఈ సంచలన తీర్పు చెప్పారు. గత ఏడాది మార్చిలో ఈ జంట హత్యలు కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించాయి. పెళ్లయిన 14 రోజులకే భార్యపై అనుమానంతో భర్త శ్రవణ్ కుమార్ తన తల్లి, తండ్రి సహకారంతో అత్త, భార్యలను చంపేశారు. ఈ కేసులో విచారించిన న్యాయస్థానం ఈ సంచలన తీర్పు చెప్పింది.
Next Story