Mon Dec 23 2024 00:39:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలోనే చనిపోయిన వైద్యురాలు.. అనుమానాలు.!
రాత్రి 2 గంటల వరకూ డ్యూటీలో ఉన్న శ్వేత.. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించారు.
నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ తెల్లారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి రెండుగంటల వరకూ డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆ తర్వాత తన గదికి వెళ్లి నిద్రపోయినట్లు చెబుతున్నారు. తెల్లవారుజామున చూసేప్పటికి ఆమె విగతజీవిగా కనిపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. నిన్న రెండు గంటల వరకూ ఆమె డ్యూటీలో ఉన్నారు. అనంతరం విశ్రాంతి గదిలో పడుకున్నారు. ఉదయం చూసేసరికి ఆమె మృతి చెందారు. గుండెపోటుతో చనిపోయారా? లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story