Sun Dec 22 2024 23:09:22 GMT+0000 (Coordinated Universal Time)
రెండువేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టడం కలకలం రేపింది. నిన్న సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి
ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టడం మరోసారి కలకలం రేపింది. నిన్న సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 208 కేజీల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తినే ప్లాస్టిక్ సంచుల్లో నిందితులు కొకైన్ భద్రపర్చారు. ఢిల్లీలోని రమేశ్ నగర్ లోని ఒక చిన్న దుకాణం నుంచి ఈ కొకైన్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందిన సమాచారం మేరకు...
అయితే ఈ సరుకును ఒక బ్రిటీష్ పౌరుడు దాచిపెట్టారని, అతడు భారత సంతతికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కొకైన్ ను దేశంలో పలు చోట్లకు పంపిణీ చేయాలని భావించి ఈ కొకైన్ ను దాచిపెట్టినట్లు తెలిపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story