Mon Dec 23 2024 04:50:00 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : రోడ్డు ప్రమాదం.. ఆటోను లారీ ఢీకొట్టడంతో
విశాఖపట్నంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు
విశాఖపట్నంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖనగరంలోని ఎంవీపీ కాలనీలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర పారిపోయే ప్రయత్నం చేశారు.
విద్యార్థులకు గాయాలు...
అయితే స్థానికులు వారిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో ఆటో మూడు పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వెళుతున్న విద్యార్థుల ఆటో ఈ ప్రమాదానికి గురయింది. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story