Mon Dec 23 2024 08:57:35 GMT+0000 (Coordinated Universal Time)
మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం..
లారీని ఆపిన డ్రైవర్.. అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద..
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ మైలార్ దేవ్ పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. అంతటితో ఆగకపోవడంతో వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు లారీ చక్రాల కిందపడి నలిగిపోయాడు. లారీని ఆపిన డ్రైవర్.. అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద ప్రాంతంలో ఉన్న లారీ నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. లారీ డ్రైవర్ ను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.
Next Story