Mon Dec 23 2024 09:17:42 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమికుల రోజున విషాదాంతమైన ప్రేమికుల కథ
మతాలు వేరుకావడంతో.. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ క్రమంలో కల్పనకు మరో వ్యక్తితో రెండు నెలలక్రితం..
ఫిబ్రవరి 14న ప్రేమికులంతా కలిసి.. తమ ప్రియమైన వారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఎన్నో ఆనందాల మధ్య కొన్ని విషాదాలూ జరిగాయి. వాటిలో ఒకటి ఈ ప్రేమజంట కథ. మతాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా యువతికి రెండు నెలల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిపించారు. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమజంట.. నార్సింగి చెరువులో విగతజీవులుగా కనిపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరుకావడంతో.. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ క్రమంలో కల్పనకు మరో వ్యక్తితో రెండు నెలలక్రితం వివాహం నిశ్చయమయింది. ఇటీవల అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన కల్పన.. నాలుగురోజుల క్రితం అదృశ్యమైంది. ఫిబ్రవరి 14న కల్పన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ ల చెప్పులు, బైకులు కనిపించాయి. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించి.. చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కల్పన, ఖలీల్ ల మృతితో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story