Fri Dec 20 2024 22:31:36 GMT+0000 (Coordinated Universal Time)
రైల్లోంచి దూకేసిన ప్రేమజంట.. ప్రియురాలు మృతి
ముఖ్యంగా చెన్నై, చెన్నై సబర్బ్లకు ఎలక్ట్రిక్ రైళ్లు నడపబడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8:30 గంటలకు..
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదిలే రైల్లో నుండి అందరూ చూస్తుండగానే ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చైన్నై బీచ్ నుండి తాంబరం వైపు వెళ్తున్న రైలు నుండి ప్రియుడు, ప్రియురాలు గట్టిగా కౌగిలించుకుని దూకేశారు. గమనించిన కో లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. తలకు బలమైన గాయమై ప్రియురాలు మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాంబరం చెన్నై కోస్టల్ లైన్ చెన్నై శివారు ప్రాంతాలను, చెన్నైని కలిపే రైలు మార్గంలో నిత్యం వందలాది రైళ్లు నడుస్తుంటాయి.
ముఖ్యంగా చెన్నై, చెన్నై సబర్బ్లకు ఎలక్ట్రిక్ రైళ్లు నడపబడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8:30 గంటలకు చెన్నై బీచ్ నుండి తాంబరం వైపు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఇంతలోనే ఓ ప్రేమ జంట కౌగిలించుకుని రైలు ముందుకు దూకింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియుడు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ విషయం గమనించిన కో పైలట్ వెంటనే రైలు ఆపేశాడు. సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఇద్దరి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరి సెల్ఫోన్లు పగిలిపోవడంతో విచారణ కష్టంగా మారింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువకుడి పేరు ఇళంగో అని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రేమికుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందన్నది విచారణలో తేలాల్సి ఉంది.
Next Story