Mon Dec 23 2024 15:43:25 GMT+0000 (Coordinated Universal Time)
Love Marriage: ప్రేమ వివాహం కాస్తా.. ఐదు నెలలకే విషాదాంతం
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఐదు నెలలకు అమ్మాయి
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఐదు నెలలకు అమ్మాయి ప్రాణాలను తీసుకుంది. పెళ్లయిన ఐదు నెలల్లోనే ప్రేమ వివాహం కాస్తా విషాదాంతంగా మారింది. ఆత్మహత్య చేసుకుని మహిళ చనిపోయింది. అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడలో అద్దె ఇంట్లో ఉంటున్న మహిళ భర్త వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తున్నారు.
అమీన్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని యడ్లపాడుకు చెందిన అంగడి మహేశ్(25)కు గుంటూరు పట్టణంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన కొరివి హర్షిత(22)తో ఫిబ్రవరి 23న పెళ్లయింది.ఇద్దరూ ప్రేమించుకోవడంతో హర్షిత తండ్రి ఇద్దరికీ పెళ్లి జరిపించారు. దంపతులు అమీన్‌పూర్‌కు మారారు. అయితే అయిదు నెలల్లోనే హర్షిత ప్రాణాలు తీసుకుంది. ఆస్తిలో వాటా తీసుకుని రావాలని మహేశ్ ఆమెను వేధించేవాడని హర్షిత తండ్రి శ్రీనివాస్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నెలకు రూ.30 వేలు పంపడమే కాకుండా పెళ్లి సమయంలో రూ.3 లక్షలు ఇచ్చామని తెలిపారు. వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు తెలిపారు.
Next Story