Mon Dec 15 2025 04:16:58 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటికి ట్రాన్స్ జెండర్ కోడలు వచ్చింది.. ఆ తర్వాత
ఓ ట్రాన్స్ జెండర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని వార్తల్లో నిలిచిన మహబూబాబాద్ యువకుడు

ఓ ట్రాన్స్ జెండర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని వార్తల్లో నిలిచిన మహబూబాబాద్ యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ట్రాన్స్ జెండర్ కోడలు వేధింపులవల్లే తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మాయమాటలతో తన కొడుకును లోబర్చుకున్న ట్రాన్స్ జెండర్ చివరకు ఆత్మహత్యకు కారణమయ్యిందని ఆరోపిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన ధరావత్ శివరాం ట్రాన్స్ జెండర్ ప్రవీణ్ అలియాస్ తపస్విని ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే ట్రాన్స్ జెండర్ భార్యతో కలిసి బ్రతకలేకపోయిన శివరాం దూరంగా ఉనాన్డు. ఇలా ఇద్దరి మద్య మనస్పర్దలు రావడంతో విడిపోయి ఎవరి జీవితం వారు బ్రతుకున్నారు. ఇటీవల శివరాంకు మరో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించారు. కానీ అతడి పెళ్లి జరక్కుండా తపస్వి అడ్డుకుంటోంది. దీంతో ఇక తనకు పెళ్లికాదేమోనని బాధపడుతూ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్యకు కోడలు తపస్వి కారణమని శివరాం తల్లి ఆరోపిస్తోంది. పెళ్లి కానివ్వకుండా తపస్వి అడ్డుకోవడం వల్లే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది.
Next Story

