Mon Dec 23 2024 12:38:31 GMT+0000 (Coordinated Universal Time)
గెస్ట్ హౌస్ లో మహిళను ఉంచారు.. ఆ తర్వాత..!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో బుధవారం సాయంత్రం ఓ గెస్ట్హౌస్లో 25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆమె దగ్గరున్న వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను లాలా, హిమాన్షు, అభిషేక్లుగా గుర్తించారు.
సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరిని ఆ మహిళ కలుసుకుంది. వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ నంబర్లు కూడా మార్చుకున్నారు. నిందితులు ఆమెతో హోటల్ వ్యాపారం చేయిస్తామని.. అందుకోసం గ్వాలియర్ కు రావాలని చెప్పారు. వారి మాటలను నమ్మిన ఆమె నగరానికి వచ్చేసింది. ఆ మహిళను ఓ గెస్ట్ హౌస్ లో ఉంచారు. అయితే అదేరోజు రాత్రి ఆమె సోషల్ మీడియా ఫ్రెండ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి గెస్ట్ హౌస్కు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముగ్గురు నిందితులపై మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితులందరూ పరారీలో ఉన్నారు.
సోషల్ మీడియాలోని వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయని మనం గుర్తించాలి. మనం మాట్లాడుతున్న అవతలి వ్యక్తులు మేక వన్నె పులులుగా ఉంటారు. అమ్మాయిలు ముఖ్యంగా వారి మాటలను నమ్మి.. వారు చెప్పింది చేయడం వలన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని వెంటాడే మోసగాళ్లు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను నమ్మి జీవితాలను నాశనం చేసుకోకండని పోలీసులు, నిపుణులు హితవు పలుకుతూ ఉన్నారు.
Next Story