Mon Dec 23 2024 15:33:46 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు మైనర్ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి అరెస్ట్
గత 7 సంవత్సరాలుగా వారి అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో నిత్యం తన ఇద్దరు కూతుళ్లపై ..
రేవా : సభ్య సమాజం తలదించుకునే పనిని ఆ తండ్రి చేశాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడై కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మధ్యప్రదేశ్లోని రేవాలో తన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన తండ్రిని అరెస్టు చేశారు. భర్తపై బాలికల తల్లి కేసు పెట్టడంతో షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
గత 7 సంవత్సరాలుగా వారి అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో నిత్యం తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి పూట మద్యం సేవించి ఇంటికి వచ్చినప్పుడల్లా కూతుళ్లపై బలవంతంగా అత్యాచారం చేసేవాడు. అంతకుముందు పెద్ద కూతురిని, ఆ తర్వాత మైనర్ కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.
అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ శివకుమార్ వర్మ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Next Story