Sun Dec 22 2024 08:11:58 GMT+0000 (Coordinated Universal Time)
అత్తను చంపడానికి కోడలికి సుపారీ ఇచ్చిన మామ
అత్తను చంపడానికి కోడలికి సుపారీ ఇచ్చిన మామ
అత్తను చంపడానికి కోడలికి 'సుపారీ' ఇచ్చిన మామ కథ ఇది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఎంపీలోని రేవా జిల్లాలో తన భార్యను చంపినందుకు 51 ఏళ్ల వ్యక్తిని, అతని కోడలును అరెస్టు చేశారు. వాల్మీకి కోల్ అనే వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, తన భార్య సరోజను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దేంతో ఆమె గొంతు కోసేందుకు తన కోడలు కంచన్ కోల్ (25)కి రూ.4వేలు సుపారీగా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.
వాల్మీకి ప్రతి నెలా ఆమెకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూనే ఉంటానని 'డీల్' జరిగింది. సరోజ, కాంచన్ల మధ్య సఖ్యత లేదని వాల్మీకి తెలుసు, అందుకే అతను దానిని సద్వినియోగం చేసుకున్నాడని చెబుతున్నారు. సరోజ్ (50) జూలై 12న తన ఇంట్లో శవమై కనిపించింది. హత్య జరిగిన రోజు వాల్మీకి సాత్నాలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. "జూలై 12న ఆమె తన అత్తయ్యను చంపేసింది. కొడవలితో ఆమె గొంతు కోసింది" అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కోడలిపై అనుమానం రాగా.. తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చేసింది. దీంతో కోడలిని, మామను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story