Sun Dec 22 2024 22:28:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్యూటీపార్లర్ గురించి గొడవ.. భార్య ఆత్మహత్య
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ కు చెందిన బలరామ్ యాదవ్ ఇంట్లోనే..
చిన్న చిన్న కారణాలకే అందమైన, ఆనందమైన జీవితాలను క్షణికావేశంలో క్షణకాలంలో ముగించేస్తున్నారు. బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని భర్త గదమాయించడంతో మనస్తాపం చెందిన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ కు చెందిన బలరామ్ యాదవ్ ఇంట్లోనే కుట్టుపని చేసుకుంటూ భార్య రీనాతో కలిసి ఉంటున్నాడు. ఏప్రిల్ 27 గురువారం మద్యాహ్నం రీనా యాదవ్ బ్యూటీ పార్లర్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పగా.. అతను వద్దని వారించాడు. ఎందుకు వెళ్లొద్దని రీనా ఎదురు ప్రశ్నించడంతో.. ఇద్దరి మధ్య వివాదం రేగింది.
మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది. బ్యూటీపార్లర్ కోసం భర్త ఇంత గొడవ చేయడాన్ని తట్టుకోలేకపోయిన రీనా యాదవ్..గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకీ భార్య బయటకు రాకపోవడంతో బలరామ్ యాదవ్ తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో రీనాను కిందికి దించి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆమె మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రీనా యాదవ్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, బలరామ్ యాదవ్ ను విచారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story