Mon Dec 23 2024 04:07:02 GMT+0000 (Coordinated Universal Time)
తల్లిని చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి.. నెలల తరబడి ఇంట్లోనే ..
దాంతో పోలీసులు తల్లికూతురు నివాసం ఉంటోన్న అపార్ట్ మెంట్ కి వెళ్లి వెతికారు. అక్కడే ఓ బ్యాగు కనిపించగా.. దానిని ఓపెన్..
కన్నతల్లిని కూతురే హత్య చేసి, ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కి.. నెలల తరబడి ఇంట్లోనే ఉంచుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగుచూసింది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో తల్లికూతురు నివాసం ఉండేవారు. ఓ రోజు తల్లిని చంపేందుకు 21 ఏళ్ల కూతురు ప్లాన్ చేసింది. పథకం ప్రకారం తల్లిని చంపి.. ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కింది. కొన్ని నెలలపాటు ఆ బ్యాగుని ఇంట్లోనే ఉంచింది. మార్చి 14, మంగళవారం మృతురాలి సోదరుడు, మేనల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో పోలీసులు తల్లికూతురు నివాసం ఉంటోన్న అపార్ట్ మెంట్ కి వెళ్లి వెతికారు. అక్కడే ఓ బ్యాగు కనిపించగా.. దానిని ఓపెన్ చేసి చూసి నిర్ఘాంతపోయారు. కుళ్లిపోయి, భరించలేని వాసనతో ఆమె మృతదేహం కనిపించింది. వెంటనే కూతురిని అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. అసలు తల్లిని ఎందుకు చంపింది ? మృతదేహాన్ని నెలల తరబడి ఇంట్లోనే ఎందుకు ఉంచింది ? అన్న ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది. దేశరాజధాని ఢిల్లీలో శ్రద్ధ వాకర్ హత్యోదంతం మొదలు.. అలాంటి హత్యల ఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్కడ, ఇక్కడని తేడా లేకుండా చిన్న చిన్న గొడవలకే మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు.
Next Story