Mon Dec 23 2024 13:01:18 GMT+0000 (Coordinated Universal Time)
బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం.. చివరికి..
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో ఓ యువతి చదువుకుంటూ హాస్టల్ లో ఉంటోంది. షోలాపూర్ కు చెందిన 19 ఏళ్ల
సమాజంలో కామవాంఛ పెరిగిపోతోంది. కుప్పలు తెప్పలుగా వస్తోన్న పోర్న్ వీడియోలు మనిషి ఆలోచనను మార్చేస్తుంది. కోరిక తీర్చుకోవాలన్న ఆలోచన.. మనిషిలో ఉన్న మృగాన్ని నిద్రలేపుతోంది. ఫలితంగా అభం శుభం ఎరుగని పసిపిల్లల నుంచి 60 ఏళ్ల మహిళల వరకూ.. అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. బాలికతో స్నేహం నటించి, లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. అంతటితో ఆగకుండా ఫొటోలు తీసి.. పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో.. విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో ఓ యువతి చదువుకుంటూ హాస్టల్ లో ఉంటోంది. షోలాపూర్ కు చెందిన 19 ఏళ్ల యువకుడు ఆమెపై కన్నేశాడు. బాలికతో స్నేహం చేసినట్టు నటించి, తన మాయమాటలతో ప్రలోభపెట్టాడు. ఓ రోజు లాడ్జికి తీసుకెళ్లి.. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. తాను చెప్పినట్టు వినకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ.. బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడి చిత్రహింసలతో విసిగిపోయిన బాలిక చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సోమవారం వరకూ అతడిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
Next Story