Mon Dec 23 2024 09:59:44 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లి కేంద్రంగానే మొత్తం ఫ్రాడ్
మహేష్ బ్యాంకు ఫ్రాడ్ కేసు ఒక కొలక్కి వచ్చేలా కనిపిస్తుంది. సైబర్ నేరగాళ్లు 12.93 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
మహేష్ బ్యాంకు ఫ్రాడ్ కేసు ఒక కొలక్కి వచ్చేలా కనిపిస్తుంది. మహేష్ బ్యాంకులో సైబర్ నేరగాళ్లు 12.93 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పోలీసులు పురోగతి సాధించారు. కూకట్ పల్లి కేంద్రంగా ఇది జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు. కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఒక మాల్ వద్ద హ్యాకింగ్ జరిగిందని భావిస్తున్నారు. నైజీరియన్ల సహకారంతో ఈ ముఠా మహేష్ బ్యాంకులో సొమ్మును కొల్లగొట్టినట్లు అనుమానిస్తున్నారు.
యూపీకి చెందిన లక్కీ...
ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన లక్కీ కీలక పాత్ర పోషించాడు. లక్కీని నైజీరియన్లు ఉపయోగించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోన్ బ్రోకర్స్ తో లక్కీకి సంబంధాలున్నాయి. రుణాల కోసం వచ్చే వారి నుంచి బ్యాంకు ఖాతాలు తెరిపించి దీనికి వాడుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన పవన్ రాజు, అలెక్స్ లు కూడా 30 శాతం కమీషన్ కోసం ఈ ఫ్రాడ్ లో సహకరించారని తెలిసింది. నలుగురు అకౌంట్లను నైజీరియన్లు హ్యాక్ చేశారని పోలీసులు డిసైడ్ అయ్యారు.
Next Story