Mon Dec 23 2024 04:42:49 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల జిల్లాలోని తమ్మరాజు పాల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కడప జిల్లా వాసులుగా...
గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు పంపి చికిత్స అందిస్తున్నారు. మృతులు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story