Tue Dec 24 2024 18:06:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మహత్య చేసుకున్న నటుడు ప్రసాద్
Malayalam actor Prasad found hanging from a tree outside his house
మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన యాక్షన్ హీరో బిజు చిత్రంలో కీలక పాత్ర పోషించిన మలయాళ నటుడు ఎన్ డి ప్రసాద్ (43) కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో శవమై కనిపించారు. అతను జూన్ 25 సాయంత్రం తన ఇంటి బయట చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అతని పిల్లలు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. "ప్రసాద్ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతని భార్య కూడా కొన్ని నెలలుగా అతనికి దూరంగా ఉంటోంది. ఆత్మహత్య చేసుకోడానికి కొన్ని రోజుల ముందు నుండి నిరాశకు లోనైనట్లు ఉన్నాడు" అని ఒక పోలీసు అధికారిని తెలిపారు. ప్రసాద్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రసాద్ పై కొన్ని ఆరోపణల కారణంగా గతంలో వార్తల్లో నిలిచాడు. అతడిపై మాదకద్రవ్యాల అభియోగాలు నమోదు చేయబడ్డాయి. అతను సింథటిక్ డ్రగ్స్ కలిగి ఉన్నందుకు 2021 లో అరెస్టయ్యాడు. ప్రసాద్ చాలా సినిమాల్లో నటించాడు. 2016లో విడుదలైన యాక్షన్ హీరో బిజులో అతని క్లైమాక్స్ సన్నివేశం అతనికి పేరు తెచ్చిపెట్టింది. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ప్రసాద్ అనేక పోలీసు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది, ఎర్నాకులం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం అధికారులు నిర్వహించిన దాడిలో, ప్రసాద్ 2.5 గ్రాముల హషీష్ ఆయిల్, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్, 15 గ్రాముల గంజాయి, కొడవలితో పట్టుబడ్డాడు. ప్రసాద్‌పై పలు పోలీస్ స్టేషన్లలో పలు పోలీసు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
News Summary - Malayalam actor Prasad found hanging from a tree outside his house.. Action Hero Biju actor Prasad found hanging at his residence
Next Story