Sun Dec 22 2024 21:30:43 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో యువతిని చంపి.. మధ్యప్రదేశ్ లో దొరికిపోయాడు
బెంగళూరులోని కోరమంగళలోని హాస్టల్లో 22 ఏళ్ల బీహార్
బెంగళూరులోని కోరమంగళలోని హాస్టల్లో 22 ఏళ్ల బీహార్ యువతిని హత్య చేసిన నిందితుడిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. అభిషేక్ అనే నిందితుడు జూలై 23వ తేదీ రాత్రి కృతి కుమారిని దారుణంగా హత్య చేసి మధ్యప్రదేశ్‌కు పారిపోయాడు. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని బెంగళూరులో విచారించనున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో కృతి కుమారి పనిచేస్తూ ఉంది.
సౌత్ ఈస్ట్ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, కోరమంగళ పోలీస్ స్టేషన్ నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న వెంకట్‌రెడ్డి లేఅవుట్లోని భార్గవి పీజీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో నిందితుడు పీజీ హాస్టల్లోకి చొరబడి మూడో అంతస్తులోని ఆమె గది దగ్గర కత్తితో కృతి గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మహిళకు పలుచోట్ల కత్తిపోట్లు అయ్యాయని పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు హాస్టల్లోని కృతి గదికి వెళ్లి తలుపు తట్టాడు. కృతి తలుపు తెరవగానే, ఆమెను బయటకు లాగి ఆ వ్యక్తి కత్తితో పొడిచాడు. దాడిని అడ్డుకునేందుకు మహిళ పోరాడింది. అయినప్పటికీ ఆమెను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అక్కడి నుండి అభిషేక్ పారిపోవడం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ఘటనకు పీజీ హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆరోపించారు.
Next Story