Mon Dec 23 2024 14:58:38 GMT+0000 (Coordinated Universal Time)
గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పినందుకు దాడి.. ఆ తర్వాత సెల్ఫీ
ఎవరు ఎప్పుడు.. ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సార్లు చిన్న చిన్న వాటికే ఊహించని గొడవలు, దాడులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఎవరు ఎప్పుడు.. ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సార్లు చిన్న చిన్న వాటికే ఊహించని గొడవలు, దాడులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే కోపంతో ఓ యువకుడు.. మరో యువకుడిని కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా బాధితుడితో కలిసి సెల్ఫీ కూడా తీసుకుని.. తన ఫ్రెండ్స్ కు కూడా పంపించాడు. గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ అని చెబితే ఇంత దారుణానికి ఒడిగడతారా అని అందరూ షాక్ అవుతూ ఉన్నారు.
లంగర్ హౌజ్ లో ఉండే రోహన్ అనే యువకుడిని ఫిలింనగర్ కు చెందిన ఓ యువతి ప్రేమిస్తోంది. యువతి ఇంటి సమీపంలో ఉండే చింటూ అనే యువకుడు ఫేస్ బుక్ లో ఆ అమ్మాయికి 'హాయ్' అని మెసేజ్ పెట్టాడు. సదరు యువతి ఈ విషయాన్ని తన లవర్ రోహన్ తో చెప్పింది. మంగళవారం సాయంత్రం చింటూను లంగర్ హౌజ్ లోని కొత్త బ్రిడ్జ్ వద్దకు తీసుకువచ్చేలా రోహన్ ప్లాన్ చేశాడు. చింటూ అక్కడికి రాగానే రోహన్ కోపం కట్టలు తెంచుకుంది.. నా గర్ల్ ఫ్రెండ్ కే హాయ్ అని మెసేజీ పెడతావా అంటూ రెచ్చిపోయాడు. చింటూపై కత్తితో దాడి చేశాడు. రోహన్ స్నేహితుడు కూడా సహకరించాడు. రోహన్ చింటూ పై 8 కత్తిపోట్లు పొడిచాడు. యువకుడిపై దాడి చేసిన తర్వాత రోహన్ సెల్ఫీలు దిగాడు. ఈ సెల్ఫీ వీడియోలను రోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏది ఏమైనా యువత చిన్న చిన్న విషయాలకే ఇలా కత్తులతో దాడి చేసేదాకా వెళ్తుండడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.
Next Story