Fri Dec 20 2024 22:14:58 GMT+0000 (Coordinated Universal Time)
సంగారెడ్డిలో ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో యువతికి గాయాలు
అఖిల నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది. అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి గాయాల పాలైన ఘటన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్యాంపస్ లో చోటుచేసుకుంది. మనూరు మండలం తిమ్మాపూర్ కు చెందిన తెనుగు అఖిల (21) పై నారాయణఖేడ్ పోతంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ (22) బ్లేడ్ తో దాడిచేయగా ఆమెకు గాయాలయ్యాయి. అఖిల నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది. అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల కాలేజీ ఆవరణలో ఉన్నట్లు తెలుసుకున్న ప్రవీణ్ అక్కడకు చేరుకున్నాడు.
కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న అతడిని అఖిల పట్టించుకోకపోవడంతో ఆమెపై బ్లేడ్ తో దాడి చేశాడు. అఖిల మెడ, చేతులపై దాడి చేయగా.. ఆమెకు గాయాలయ్యాయి. అఖిల తోటి విద్యార్థులు ప్రవీణ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అఖిలను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆమెను విచారించేందుకు పోలీసులు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story