Mon Dec 23 2024 17:23:50 GMT+0000 (Coordinated Universal Time)
కొడుకు బర్త్ డే పార్టీకి చుట్టాలను పిలిచి.. గదిలో వేసి చితక్కొట్టాడు
తొలి పుట్టినరోజు వేడుకలకు బంధువులందరినీ ఆహ్వానించాడు. కేక్ కటింగ్ అనంతరం.. వారితో కలిసి నవీన్ మద్యం సేవించాడు.
కొడుకు బర్త్ డే పార్టీకి బంధువులను ఆహ్వానించాడు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వచ్చిన చుట్టాలకు మందుపార్టీ కూడా ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ అర్థరాత్రి అయ్యే సరికి బంధువులపై విరుచకుపడ్డాడు. వాళ్లందరినీ ఒక గదిలో వేసి చితక్కొట్టాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అత్వెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. ఫిబ్రవరి 13న రాత్రి నవీన్ కుమార్ తన కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.
తొలి పుట్టినరోజు వేడుకలకు బంధువులందరినీ ఆహ్వానించాడు. కేక్ కటింగ్ అనంతరం.. వారితో కలిసి నవీన్ మద్యం సేవించాడు. తెచ్చిన మందు సరిపోలేదని, ఇంకా తీసుకురావాలని చెప్పి.. బంధువుల్లో ఒకరిని కారు ఇవ్వాలని కోరాడు. నవీన్ మద్యంమత్తులో ఉండటంతో.. వారు కారు ఇచ్చేందుకు నిరాకరించారు. నాకెందుకు కారు ఇవ్వరంటూ బంధువులను తిట్టడం మొదలుపెట్టాడు. దాంతో వాళ్లు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు బయల్దేరారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నవీన్.. తన ఇంటి నుండి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ.. కేకలేశాడు.
చిన్న, పెద్ద తేడా లేకుండా వారందరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వాళ్లని లోపలే ఉంచి.. బయట తాళం పెట్టాడు. చాలా సేపటి వరకూ లోపలే భయంతో ఉండిపోయిన బంధువులు చివరికి 100కి కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న బంధువులను బయటికి తీసుకొచ్చి.. నవీన్ ను అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story