Sat Nov 23 2024 03:02:29 GMT+0000 (Coordinated Universal Time)
8 పెళ్లిళ్లు చేసుకున్న యువతి.. ఆ టార్గెట్ అస్సలు మిస్ చేయదు
ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రషీద..
ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. కొందరు సైబర్ కేటుగాళ్లైతే.. మరికొందరు పెళ్లిళ్ల కేటుగాళ్లు. ఇందులో యువతులేం తీసిపోలేదు. మేమేమీ తక్కువ కాదంటూ.. డబ్బున్న మగాళ్లకు ప్రేమ వలవేసి పెళ్లాడి.. ఆ తర్వాత డబ్బు, నగలతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఓ ఫైనాన్షియర్ అలాగే ఓ యువతి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది.
ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రషీద జులై 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం తీసుకుని వెళ్లిపోయింది. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రషీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుని, వారితో ప్రేమాయణం సాగించి.. పెళ్లి చేసుకుని.. ఆఖరికి ఇలా డబ్బు, నగలు తీసుకుని పరారవుతుందని గుర్తించారు. ఇప్పటివరకూ ఆమె కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 మందిని పెళ్లిళ్లు చేసుకుని ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించామన్నారు. రషీద కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
Next Story