Thu Apr 17 2025 01:53:12 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్రెండ్ సోదరికి వీడియో కాల్స్ చేశాడు.. న్యూడ్ కాల్స్ రికార్డు చేశాడు..!
నిందితుడు మొదట సోషల్ మీడియాలో బాధితులతో స్నేహం చేశాడు.

న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్‌లను ఉపయోగించి మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితుడిని పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పాటలీపురా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న రాహుల్ కుమార్‌గా గుర్తించారు. బాధితురాలిలో ఒకరు తన బాధను పంచుకునేందుకు మహిళా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడు మొదట సోషల్ మీడియాలో బాధితులతో స్నేహం చేశాడు. ఆ తర్వాత బాధితులకు వీడియో కాల్లు చేసి నగ్నంగా ఉండమని చెప్పేవాడు. ఆ తర్వాత వారి కాల్‌లను రికార్డ్ చేసేవాడు. ఈ అసభ్యకర వీడియోలను ఉపయోగించి బాధితులతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు బ్లాక్ మెయిల్ చేసేవాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగేవాడు. నిందితుడితో కలిసి పనిచేసిన ఓ వ్యక్తి సోదరిని అతడు ట్రాప్ లోకి లాగాడు. నిందితుడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. పోలీసులు నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
News Summary - man blackmails women by recording nude video calls
Next Story