Mon Dec 23 2024 13:39:47 GMT+0000 (Coordinated Universal Time)
కుక్కనీ వదలని కామాంధుడు.. సీసీ టీవీ ఫుటేజీలో బయటపడ్డ దారుణం
ఫిబ్రవరి 5వ తేదీన తనకు ఈ దారుణానికి సంబంధించిన వీడియో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి వీధి కుక్కపై లైంగిక వేధింపులకు..
నోరున్న ఆడపిల్లలనే కాదు.. నోరులేని మూగజీవాలను కూడా వదలడం లేదు కొందరు కామాంధులు. మనిషి రూపంలో ఉన్న ఓ మృగం.. వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డవ్వడంతో.. స్థానికులు ఆ ఫుటేజీని స్థానికులు జంతు హక్కుల కార్యకర్తలకు పంపడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద : రాజమౌళి
ఈ ఘటనపై ఓ కార్యకర్త పృథ్వీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 5వ తేదీన తనకు ఈ దారుణానికి సంబంధించిన వీడియో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి వీధి కుక్కపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వీడియో క్లిప్ లో ఉంది. నల్లకుంటలోని నర్సింహ బస్తీలో ఈ ఘటన జరగ్గా.. గత మూడ్రోజులుగా ఆ వ్యక్తి పదే పదే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దాంతో వీడియోను నల్లకుంట పోలీసులకు చూపించి, ఫిర్యాదు చేయగా.. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11(ఎ) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story