Mon Dec 23 2024 18:49:18 GMT+0000 (Coordinated Universal Time)
మర్మాంగాలను కోసి.. భార్య దారుణ హత్య
బెంగళూరు బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్భయ తరహాలో భర్తే..
భార్యపై అతనికున్న అనుమానం.. ఆమెను దారుణంగా హత్య చేసేందుకు దారితీసింది. వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం ఉందన్న అనుమానంతో.. భార్య మర్మాంగాలను కోసి అతి కిరాతకంగా హతమార్చాడు. కర్ణాటకలోని యశ్వంతపురలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన అక్క కొడుకుతో భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో.. నిజానిజాలు తెలుసుకోకుండానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరు బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్భయ తరహాలో భర్తే అతి దారుణంగా భార్య మీద దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయ్యప్ప - నాగరత్నం లకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్, భూమిక అనే కొడుకు, కూతురు ఉన్నారు. నాగరత్న రామానగరంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండగా.. అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలిపనులు చేస్తుండేవాడు. నాగరత్న ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతుండటంతో.. కొద్దిరోజులుగా అయ్యప్పకు భార్యపై అనుమానం మొదలైంది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
ఒకరోజు అయ్యప్ప అక్కకొడుకు చంద్రు ఇంటికి వచ్చాడు. అయ్యప్ప ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించడంతో.. అయ్యప్ప కోపం కట్టలు తెంచుకుంది. నువ్వెందుకు వచ్చావంటూ చంద్రుతో గొడవకు దిగాడు. ఈ గొడవ జరిగిన మూడురోజుల తర్వాత నిద్రలో ఉన్న నాగరత్నపై దాడి చేశాడు. ఆమె మర్మాంగం మీద చాకుతో పొడిచి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. పరారీలో ఉన్న అయ్యప్పకోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story