Mon Dec 23 2024 04:56:39 GMT+0000 (Coordinated Universal Time)
చెవులు, ముక్కు, నాలుక కోసేసి.. వికారాబాద్ లో దారుణ హత్య
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో ఈ హత్య వెలుగుచూసింది. ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుకను కోసి అతి కిరాతకంగా చంపేశారు.
తెలంగాణలో గడిచిన నాలుగు రోజుల్లో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం.. ఒకేరోజు అర్థరాత్రి హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల హత్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత బల్కంపేట బోనాల జాతరలో కత్తులతో దాడులు, అనారోగ్య కారణాలతో కుటుంబం ఆత్మహత్య, భర్త వేధింపులతో టెక్కీ, ఇతర కుటుంబ సమస్యలతో తల్లికొడుకు, తల్లి కూతుళ్ల ఆత్మహత్యలు.. ఇలా చాలానే జరిగాయి. వరుస క్రైం లతో నగరంలో భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా వికారాబాద్ లో ఓ వ్యక్తి హత్యకు గురైన తీరు.. గగుర్పాటుకు గురిచేస్తోంది.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో ఈ హత్య వెలుగుచూసింది. ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుకను కోసి అతి కిరాతకంగా చంపేశారు. మృతుడిని దౌల్తాబాద్ కు చెందిన సంగేపల్లి శేఖర్ (32)గా పోలీసులు గుర్తించారు. శేఖర్ ను అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. పాతకక్షలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో శేఖర్ ను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిగా భావిస్తున్న గోపాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై రమేశ్ కుమార్ వెల్లడించారు.
Next Story