Sun Dec 22 2024 14:28:03 GMT+0000 (Coordinated Universal Time)
రూ.10 వేల కోసం గొడవ.. హైకోర్టు ముందు వ్యక్తి దారుణ హత్య
రూ.10 వేల కోసం ఇద్దరిమధ్య గొడవ జరగడంతో.. కోపం పట్టలేక వ్యక్తిని పొడిచి చంపినట్లు అతను పోలీసుల ఎదుట..
రూ.10 వేల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అది కూడా హైదరాబాద్ లోని హైకోర్టు ముందు నడిరోడ్డుపై నలుగురూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. హత్యానంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రూ.10 వేల కోసం ఇద్దరిమధ్య గొడవ జరగడంతో.. కోపం పట్టలేక వ్యక్తిని పొడిచి చంపినట్లు అతను పోలీసుల ఎదుట అంగీకరించాడు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు.
10 వేల రూపాయల కోసం ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలో మాటామాట పెరగడంతో.. ఓ వ్యక్తి కోపం పట్టలేక కత్తితో పొడిచి మరో వ్యక్తిని హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని స్థానిక సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే మిథున్ గా గుర్తించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని విచారిస్తున్నారు.
Next Story