Sun Dec 22 2024 22:19:01 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న బిశ్వాస్ గురించి కీలక విషయాలు
పంజాగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి
పంజాగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆపై నాంపల్లిలో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అస్సాంకు చెందిన బిస్వాస్ (24), పంపా సర్కార్ (22) దంపతులు 20 రోజుల క్రితం ప్రేమ్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులు తెలిపారు.
ఇటీవల తన భార్యతో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత బిశ్వాస్ ఆమెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లోని నీటి బకెట్లో ఉంచాడు. ఆ తర్వాత రైలు కింద దూకి జీవితాన్ని ముగించాడు. బిశ్వాస్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాతే హత్య వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాంకు చెందిన మహానంద బిస్వాస్ (24) జివికె మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అస్సాంకు చెందిన తన భార్య రూపా సర్కార్ (22)తో కలిసి హైదరాబాద్లో నివసిస్తూ వస్తున్నాడు. బిశ్వాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో అతని దుస్తులను తనిఖీ చేసిన హైదరాబాద్ రైల్వే పోలీసులకు అతని పర్సులో లేఖ కనిపించింది. లేఖ అస్సామీ భాషలో వ్రాయబడింది భాష తెలిసిన కొంతమంది వ్యక్తుల సహాయంతో పోలీసులు మంగళవారం అందులోని కంటెంట్ను అర్థం చేసుకున్నారు. ఆ లేఖలో తన భార్యను హత్య చేశానని, ఆమె మృతదేహం పంజాగుట్టలోని తమ ఇంట్లో పడి ఉందని ఆ వ్యక్తి రాశాడు. అతను నిరాశకు గురై, తన భార్యను అనుమానించి తన జీవితాన్ని ముగించుకున్నాడు.
Next Story