Mon Dec 23 2024 14:12:16 GMT+0000 (Coordinated Universal Time)
సెల్ఫీ కోసం వెళ్లి శవమై..!
కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్షా, అబ్దుల్ షాదాబ్తో
ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలు తీసుకోవడమే కొందరికి పని. కానీ ఆ సెల్ఫీ సరదా ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వాగు వద్ద సెల్ఫీ దిగుతుండగా బీటెక్ విద్యార్ధి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్షా, అబ్దుల్ షాదాబ్తో కలిసి గురువారం ఉదయం బైక్పై కంఠాత్మకూర్ వాగు వద్దకు చేరుకున్నారు. వాగులోని నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇస్మాయిల్ అందులో పడిపోయాడు. స్నేహితుడు నీటిలో మునిగిపోతుండటం చూసిన సయ్యద్ జాహెద్షా, అబ్దుల్ షాదాబ్ కాపాడంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆలస్యం అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story