Mon Dec 23 2024 10:32:29 GMT+0000 (Coordinated Universal Time)
విందులో విషాదం.. మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి
ఇలాంటి ఘటనల నుండి అంత తేలికగా కోలుకోలేం. ఇటీవల తెలంగాణలో ఓ బాలుడు గొంతులో కొబ్బరిముక్క ఇరుక్కుని..
అప్పటివరకూ మనతో చక్కగా మాట్లాడుతూ.. నవ్వుతూ ఉండేవాళ్లని.. ఉన్నట్టుండి మృత్యువు కబళిస్తుంది. ఇలాంటి ఘటనల నుండి అంత తేలికగా కోలుకోలేం. ఇటీవల తెలంగాణలో ఓ బాలుడు గొంతులో కొబ్బరిముక్క ఇరుక్కుని మృతి చెందాడు. అంతకుముందు వరంగల్ లో మరో బాలుడు చాక్లెట్ తిని కన్నుమూశాడు. తాజాగా మరో వ్యక్తి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని చనిపోయాడు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది కానీ.. ఆ వ్యక్తి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటివద్ద నిర్వహించిన పెళ్లి విందుకెళ్లాడు రమణ గౌడ్ (45). భోజనం చేస్తుండగా.. అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. మాటరాక, ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న రమణ గౌడ్ ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే అతను మృతి చెందాడు. హార్ట్ ఎటాక్, గ్యాస్ట్రిక్ ప్లాబ్రమ్ తో రమణ గౌడ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రమణగౌడ్ మృతితో అందరూ షాకయ్యారు. పెళ్లి విందు చేస్తూ మరణించడంతో.. పెళ్లింటిలోనూ విషాదం నెలకొంది.
Next Story