Sun Mar 30 2025 23:35:11 GMT+0000 (Coordinated Universal Time)
మూసాపేట మెట్రో స్టేషన్లో వ్యక్తి బలవన్మరణం
మెట్రో ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ వ్యక్తి కావాలనే..

ఓ వ్యక్తి మెట్రో ట్రైన్ కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మూసాపేట్ లో చోటుచేసుకుంది. గురువారం (జనవరి 5) రాత్రి 9.16 గంటల సమయంలో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న మెట్రో ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ వ్యక్తి కావాలనే ట్రైన్ వస్తుండగా ట్రాక్ పైకి దూకినట్లు గుర్తించారు. స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి వెంటనే కూకల్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా.. ఆ వ్యక్తి ట్రైన్ ఇంజిన్ - ప్లాట్ ఫారమ్ కు మధ్య ఇరుక్కుపోగా అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మరణించాడు. టికెట్ లేకుండా లోనికి ప్రవేశించి ప్లాట్ ఫాం 02 పైకి వస్తున్న రైలు కిందకు దూకినట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు. అతను స్థానికుడేనని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండ్రోజుల క్రితమే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అంతలోనే.. సమీపంలోని మూసాపేట్ లో మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
Next Story