Sun Dec 22 2024 23:41:31 GMT+0000 (Coordinated Universal Time)
మీర్జాపూర్ లో 8000 రూపాయల గొడవ.. చివరికి
8000 రూపాయలు.. ఆ పని చేయాల్సి వచ్చింది. మీర్జాపూర్ లో 8000 రూపాయల గొడవ.. చివరికి
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి రూ.8,000 తిరిగి ఇవ్వనందుకు ఉమ్మి వేసిన చెప్పును బలవంతంగా నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది, అక్కడ వ్యక్తి చెప్పును బలవంతంగా నాకించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ మిశ్రా అనే వ్యక్తి విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 9, 2023న సనోజ్ కనౌజియా విద్యుత్ బిల్లును తగ్గిస్తామని చెప్పి రూ.8,000 లంచంగా తీసుకున్నాడు. అయితే దిలీప్ మిశ్రా సనోజ్ కనౌజియా విద్యుత్ బిల్లును తగ్గించ లేదు. దీంతో సనోజ్ కనౌజియా తన రూ. 8,000 తిరిగి ఇవ్వాలని కోరాడు. మిశ్రా డబ్బులు వెనక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో కనౌజియా తన చెప్పుపై ఉమ్మి వేసి.. దాన్ని నాకాలని.. అప్పుడే నీ డబ్బు మాఫీ అయిందని అనుకుంటానని దిలీప్ మిశ్రాను బలవంతం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన 30 సెకన్ల నిడివి గల వీడియోలో సనోజ్ చేసిన ఒత్తిడికి మిశ్రా ఆ పని చేయాల్సి వచ్చింది.
ఈ ఘటన జరిగి మూడు నెలలు అవుతోందని మీర్జాపూర్ పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ అవ్వడంతో తన దృష్టికి వచ్చిందని.. బాధితుడు దిలీప్ మిశ్రా ఫిర్యాదుతో నిందితుడు సరోజ్ కనౌజియాను కటకటాల వెనక్కి పంపమని తెలిపారు.
Next Story