Sun Dec 22 2024 11:00:10 GMT+0000 (Coordinated Universal Time)
కన్నకూతురిని తలకిందులుగా వేళాడదీసిన తండ్రి.. కారణం ఏంటంటే?
10 ఏళ్ల కుమార్తెను తాడుతో తలకిందులుగా కట్టేసి
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి తన 10 ఏళ్ల కుమార్తెను తాడుతో తలకిందులుగా కట్టేసి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం నాడు తెలిపారు. బార్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) రాజా దినేష్ సింగ్ మాట్లాడుతూ కుమార్తె తన మాట వినకపోవడంతో తండ్రి గోవింద్ రాయ్ ఈ పనికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీశారని, అది వైరల్గా మారిందని తెలిపారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితుడైన తండ్రిని జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఆదేశించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి తన కూతురిని తలకిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టాడు. "నాన్న.. దయచేసి నన్ను వెళ్లనివ్వండి" అని తండ్రిని వేడుకున్నా కూడా కఠినంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానిక గ్రామస్థుడు జోక్యం చేసుకుని బాలికను రక్షించాడు.
Next Story