Sun Dec 22 2024 11:11:50 GMT+0000 (Coordinated Universal Time)
భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని చంపేసి పట్టాలపై పడుకున్నాడు.. ఆ తర్వాత
చనిపోవాలని అనుకుని పట్టాలపై పడుకున్నాడు
తన భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలను హత్య చేసినందుకు 51 ఏళ్ల నగల వ్యాపారిని ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో ఎదురవుతున్న ఒడిదుడుకుల కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులను సోపోరిఫిక్ (నిద్ర కలిగించే) మాత్రలను మొదట ఇచ్చాడు. ఆ తర్వాత గొంతునులిమి చంపేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆభరణాల వ్యాపారి కూడా ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. రైలు కింద పడి తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
లాల్పురా, కొత్వాలి ప్రాంతానికి చెందిన ముఖేష్ వర్మ (51) అనే నగల వ్యాపారి అప్పుల పాలయ్యాడు. సోమవారం తన భార్య రేఖా వర్మ (42), కూతుళ్లు భవ్య (20), కావ్య (15), కుమారుడు అభీష్త్ (10)లకు నిద్రమాత్రలు వేసినట్లు పోలీసులకు తెలిపాడు. వారు అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత తాడుతో వారి గొంతు బిగించి చంపాడు. ఎటావా రైల్వే స్టేషన్కు వెళ్లే ముందుతన కుటుంబ సభ్యులు చనిపోయారని వాట్సాప్ లో పోస్ట్ చేశాడు. ఇక చనిపోవాలని అనుకుని పట్టాలపై పడుకున్నాడు. అయితే, మరుధర్ ఎక్స్ప్రెస్లోని ఎనిమిది క్యారేజీలు అతని మీదుగా వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు పడుకున్న విధానం కారణంగా రైలు అతడి శరీరాన్ని తాకలేదు. వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బంది అతన్ని రక్షించారు. విచారించగా, అతను తన కుటుంబంలోని నలుగురిని చంపినట్లు అంగీకరించాడు.
Next Story