Mon Dec 23 2024 06:39:29 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. భార్య, నలుగురు పిల్లల్ని చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
వ్యవసాయం సంగతి తెలియనిదేముంది. లాభాలు తక్కువగా ఉంటాయి. పళనిస్వామికి కూడా ఊహించినంత లాభం రాకపోగా..
గంజాయి మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గొడ్డలితో తన భార్య, ఐదుగురు పిల్లల్ని నరికేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ దారుణ, విషాదకర ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో వెలుగుచూసింది. తిరువణ్ణామలై జిల్లాలోని ఒర్నత్తవాడి గ్రామానికి చెందిన పళనిస్వామి (45) వృత్తి రీత్యా రైతు. తనకు భార్య, నలుగురు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు భూమి కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు.
వ్యవసాయం సంగతి తెలియనిదేముంది. లాభాలు తక్కువగా ఉంటాయి. పళనిస్వామికి కూడా ఊహించినంత లాభం రాకపోగా.. అప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారమవుతుంది. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. పిల్లలకు సరిగ్గా తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కుటుంబ భారం పెరగడంతో గంజాయికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12, సోమవారం రాత్రి కూడా గంజాయి సేవించి ఇంటికెళ్లాడు.
భార్యతో రోజూలాగే గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. గొడ్డలితో భార్యతో సహా.. ఐదుగురు పిల్లలపైనా దాడి చేశాడు. ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్య, కొడుకు, ముగ్గురు కూతుర్లు చనిపోగా.. మరో కుమార్తె కొనఊరిపితో చావుబ్రతుకుల మధ్య పోరాడుతోంది. మృతులు త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్ (4), భూమిక (9నెలలు)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story