Mon Dec 23 2024 18:46:38 GMT+0000 (Coordinated Universal Time)
భార్యతో గొడవ.. అడ్డొచ్చిన పిల్లలపై దాడి, కూతురిని 17సార్లు..
మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగిన భర్త.. ఆమెపై కత్తితో హత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన కూతురు, ముగ్గురు..
చిన్న చిన్న కారణాలకే దంపతుల మధ్య తలెత్తుతోన్న గొడవలు ప్రాణాలు తీసేంతవరకూ దారిస్తున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియకుండా.. హత్యలు చేసి జైలు పాలవుతున్నారు. తాజాగా గుజరాత్ లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగిన భర్త.. ఆమెపై కత్తితో హత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన కూతురు, ముగ్గురు కొడుకులపై దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన రామానుజ్ మహాదేవ్ సాహు, రేఖాదేవి దంపతులు సూరత్ జిల్లాలోని కడోదర ప్రాంతంలో నివసిస్తుంటారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉంది.
గురువారం (మే18) రాత్రి రేఖాదేవి మేడపై నిద్రిద్దామని భర్తను కోరగా.. అందుకు మహాదేవ్ అభ్యంతరం చెప్పాడు. అనంతరం ఇద్దరూ గొడవ పడ్డారు. ఇంట్లో నుండి వెళ్లిన మహాదేవ్.. కత్తితో తిరిగివచ్చి భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆమెపై హత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న 19 ఏళ్ల కూతుర్ని కత్తితో 17 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో అతని ముగ్గురు కొడుకులు కూడా గాయపడ్డారు. కూతురిని చంపిన అనంతరం.. మహాదేవ్ పరారవ్వగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story