Sat Nov 23 2024 03:03:00 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కు బానిసై.. తండ్రి హత్య
ఎస్పీ హితికా వాసల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. దేపాల్
మాదకద్రవ్యాల వాడకం ప్రాణాలకు ప్రమాదమని, అవి జీవితాన్నే హరించేస్తాయని ఎంత అవగాహన కల్పించినా, డ్రగ్స్ దందా పై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపినా.. కేటుగాళ్లు అడ్డదారుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఫలితంగా దాని ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటోంది. మత్తుపదార్థాలకు బానిసలుగా మారి.. అవిలేకపోతే బ్రతకలేమన్నంత స్థాయికి దిగజారుతున్నారు. వాటికోసం ఎంతకైనా తెగిస్తున్నాయి. అలా డ్రగ్స్ కు బానిసైన కొడుకు.. తండ్రిని రూ.2 వేలు అడిగాడు. ఇవ్వడం కుదరదని చెప్పడంతో.. తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో జూన్ 15న జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది.
ఎస్పీ హితికా వాసల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. దేపాల్ పూర్ ప్రాంతంలోని పొలంలో జూన్ 15న చౌదరి విగతజీవిగా కనిపించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన పలు ఆధారాల ద్వారా నిందితుడు బాబు చౌదరి కొడుకు సోహాన్ (25) అని తేల్చారు. డ్రగ్స్ కు అలవాటుపడిన సోహాన్.. జూన్ 15న తండ్రిని రూ.2000 కావాలని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో.. కోపోద్రిక్తుడైన సోహాన్ రాయితో తండ్రిపై దాడి చేశాడు. పదేపదే తలపై రాయితో మోదడంతో అక్కడికక్కడే బాబు చౌదరి మరణించాడు. తండ్రిని చంపింది కొడుకేనని తేల్చిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు.
Next Story