Mon Dec 23 2024 10:31:22 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణం తీసిన పూచీకత్తు.. పెట్రోల్ పోసి
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో స్నేహితుడు తీసుకున్న రూ.15 లక్షల అప్పునకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పూచీకత్తుగా..
అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. జూన్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో స్నేహితుడు తీసుకున్న రూ.15 లక్షల అప్పునకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పూచీకత్తుగా ఉన్నాడు. అప్పు తీసుకున్న స్నేహితుడు అప్పిచ్చిన వారికి తిరిగి అసలు కాదు కదా.. వడ్డీ కూడా చెల్లించలేదు. దాంతో మధ్యలో పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్ ను అప్పు చెల్లించాలని అడిగారు.
ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వ్యక్తులకు - శ్రీకాంత్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఆధారాలు లభించకూడదని అతని మృతదేహంపై నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్యకేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగి విద్యార్థులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Next Story