Mon Dec 23 2024 15:18:09 GMT+0000 (Coordinated Universal Time)
మెచ్యూర్ అయిన చెల్లెలు.. భార్య మాట విని కొట్టి చంపిన అన్న
వివరాల్లోకి వెళ్తే.. 12 ఏళ్ల బాలికకు మొదటిసారిగా రుతుక్రమం వచ్చింది. ఆమె అన్నకు అదేంటో కూడా తెలియదు. రుతుక్రమంలో వచ్చే..
ఏ సోదరికైనా అన్నదమ్ములు ఉంటే.. అదే అంగబలం. ఏ కష్టంలోనైనా వాళ్లు తోడుంటారనే నమ్మకం. తన బాధ్యత వాళ్లు తీసుకుంటారన్న భరోసా ఉంటుంది. కానీ.. కొందరు సోదరులు మాత్రం తోబుట్టువుల పై మరీ పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. మొదటిసారి రజస్వల అయిన చెల్లెల్ని ఓ అన్న మూడురోజులపాటు దారుణంగా కొట్టి చంపాడు. అందుకు కారణం అతని భార్య. చెల్లెలికి రక్తస్రావం అవుతుండటాన్ని చూసిన అతని కోపం కట్టలు తెంచుకుంది. జరిగిన విషయం ఇది అని చెప్పాల్సిన భార్య.. ఆమె ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుందని లేనిపోనీవన్నీ చెప్పింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 12 ఏళ్ల బాలికకు మొదటిసారిగా రుతుక్రమం వచ్చింది. ఆమె అన్నకు అదేంటో కూడా తెలియదు. రుతుక్రమంలో వచ్చే రక్తస్రావాన్ని చూసి ఎందుకలా వస్తుందని భార్యను అడిగాడు. అందుకు ఆమె చెల్లెలు మెచ్యూర్ అయిందన్న విషయం చెప్పకుండా.. ఆమెకు ఎవరితోనే శారీరక సంబంధం ఉందని అందుకే అలా రక్తస్రావం అవుతుందని భర్తకు చెప్పింది. దాంతో తీవ్రకోపోద్రిక్తుడైన అతను.. చెల్లెల్ని 3 రోజుల పాటు కొట్టి బంధీగా ఉంచడంతో ఆమె దెబ్బలు తాళలేక మృతి చెందింది.
ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని నిర్థారించిన వైద్యులు.. చిన్నారి ముఖం, మెడ, వీపుపై తీవ్రంగా కొట్టిన ఆనవాళ్లున్నాయని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Tags
- maharastra crime
Next Story