Mon Dec 23 2024 17:40:31 GMT+0000 (Coordinated Universal Time)
తనముందు శృంగారం చేయాలన్న మంత్రగాడు.. ఆ తర్వాత జననాంగాలపై..
సోనూకి.. తాంత్రికుడికి మధ్య మంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ - సోనూల సంబంధం గురించి అతడికి తెలిసింది.
ఓ మంత్రగాడు.. తనవద్దకు వచ్చిన జంటను కోరరాని కోరిక కోరాడు. తనముందే శృంగారం చేయాలని అడిగాడు. ఆ జంట నగ్నంగా మంత్రగాడు చెప్పిన పనిలో నిమగ్నమయ్యారు. అంతలోనే అతడు చేయకూడని పని చేశాడు. వారిద్దరి జననాంగాలపై ఫెవిక్విక్ పోశాడు. దాంతో వారిద్దరి ప్రైవేట్ పార్ట్స్ అతుక్కుపోయి గాయాలయ్యాయి. తీవ్రమైన నొప్పితో ఇద్దరు అక్కడే మరణించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవంబర్ 15న జరిగింది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెలాభవాడి ఏరియాకు చెందిన రాహుల్ మీనా(30) టీచర్ గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక మంత్రగాడిగా పేరొందిన భలేష్ కుమార్ వద్దకు వెళ్లి పూజలు చేయించుకునేవారు. అతని వద్ద సోనూ కున్వార్ (28) అనే అమ్మాయి కుటుంబీకులు కూడా వచ్చేవారు. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి.. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లయ్యాయి.
సోనూకి.. తాంత్రికుడికి మధ్య మంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ - సోనూల సంబంధం గురించి అతడికి తెలిసింది. దీంతో రాహుల్ భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు తాంత్రికుడు. భార్యభర్తల మధ్య ఈ విషయమై గొడవలయయ్యాయి. అందుకు కారణం మంత్రగాడేనని నిర్థారించుకున్న రాహుల్.. తమ జోలికొస్తే కేసుపెడతానని బెదిరించాడు. దాంతో తనకు సోనూకి మధ్యనున్న సంబంధం బయటపడితే పరువు పోతుందని భావించిన తంత్రగాడు.. ఎలాగైనా వారిద్దరినీ చంపాలనుకున్నాడు.
నవంబర్ 15న రాహుల్ - సోనూలను నిర్మానుష్య ప్రాంతానికి పిలిచి.. సమస్యలు పోవాలంటే తనముందే శృంగారం చేయాలన్నాడు. అతని మాటల్ని గుడ్డిగా నమ్మిన వారు.. ఆ పని మొదలుపెట్టారు. అప్పటికే సిద్ధం చేసుకున్న 50 ట్యూబ్ ల ఫెవికిక్ ను వారిద్దరి జననాంగాలపై పోసేశాడు తాంత్రికుడు. ఇద్దరికీ గాయాలై తీవ్ర రక్తస్రావంతో అక్కడే మరణించారు. అనంతరం భలేష్ కుమార్ పరారయ్యాడు. మూడ్రోజుల తర్వాత మృతదేహాలను కనుగొన్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పరారీలో ఉన్న భలేష్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
Next Story