Sun Dec 22 2024 11:43:45 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి.. భార్యను చంపేశాడు
ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ సాయంతో ఓ వ్యక్తి తన భార్యను
భువనేశ్వర్లో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ సాయంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సిరంజి, అనస్థీషియాను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఖుర్దాలోని BJB నగర్కు చెందిన సుభశ్రీ నాయక్ 2020లో కసోటికి చెందిన ప్రద్యుమ్న కుమార్ను వివాహం చేసుకుంది.ఆమె అక్టోబర్ 28న మరణించింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె భర్త, అత్తమామలు తెలిపారు. సుభశ్రీకి క్యాపిటల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. సుభశ్రీ తల్లి తపస్విని నాయక్ అనుమానంతో భరత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విచారణను కోరింది.
సుభశ్రీకి పోస్ట్మార్టం నిర్వహించగా మత్తుమందు ఎక్కువ ఇవ్వడం వల్లే సుభశ్రీ చనిపోయిందని తెలుసుకున్నారు. ఆమె పోస్ట్మార్టం నివేదిక కూడా అదే తెలిపింది. వృత్తిరీత్యా ఫార్మాసిస్ట్ అయిన ప్రద్యుమ్న, సుభశ్రీని వివాహం చేసుకున్నప్పటి నుండి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. 2023లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎజితా భుయాన్తో పరిచయం ఏర్పడిందని, మార్చి 2024లో మరో ఆసుపత్రిలో రోజీతో పరిచయం ఏర్పడిందని అతను అంగీకరించాడు.
ఎజితా, రోజీ ఇద్దరూ ప్రద్యుమ్నతో స్నేహాన్ని పెంచుకున్నారు. ముగ్గురూ కలిసి సుభశ్రీని చంపే ప్లాన్ చేశారు. రోజీ పని చేసే ఆసుపత్రి నుండి ఇంజెక్షన్లు సేకరించింది. ప్రద్యుమ్న తన భార్య సుభశ్రీని అక్టోబర్ 27న మధ్యాహ్నం 2 గంటలకు ఆమె తల్లిదండ్రుల ఇంటి నుంచి తీసుకొచ్చాడు. ఉదయం 11.30 గంటలకు, ప్రద్యుమ్న సుభశ్రీని సాంపూర్లోని బిజయ్ లాడ్జ్ సమీపంలోని రోజీ ఇంటికి తీసుకువెళ్లాడు. నిందితులు అధిక మోతాదులో అనస్థీషియాను బలవంతంగా ఇంజెక్ట్ చేయడంతో సుభశ్రీ మృతి చెందింది. బతికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా నటిస్తూ క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు, అక్కడే ఆమె చనిపోయింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
Next Story