Fri Dec 27 2024 14:18:15 GMT+0000 (Coordinated Universal Time)
నిత్య పెళ్లికొడుకు.. 26 ఏళ్లకే 21 పెళ్లిళ్లు, విచారణలో విస్తుపోయే నిజాలు
ఈ ఏడాది మార్చిలో ఝాన్సీరాణి అనే యువతితో వివాహమయింది. అనంతరం విదేశాలకు వెళ్తున్నానని, త్వరలోనే తననూ..
దేశంలో రోజురోజుకీ అమ్మాయిల కొరత పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా మంది యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టతరమైన రోజులివీ. యావరేజ్ అమ్మాయిలు కూడా లైఫ్ బాగుండాలి.. చేసుకోబోయే భర్త బాగుండాలి, మంచి ఉద్యోగం ఉండాలి అని రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంతో.. సాధారణ యువకులు వారికి నచ్చడంలేదు. నాలుగు పదుల వయసొచ్చినా.. పెళ్లికాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. ఇక ముప్పైల వయసొచ్చినవారు పెళ్లెప్పుడవుతుందా ? అని ఉన్న జుట్టు రాలిపోయేంతలా ఆలోచిస్తున్నాయి. దేశంలో యువకుల పరిస్థితి ఇలా ఉంటే.. ఓ ప్రబుద్ధుడు 26 ఏళ్ల వయసులో ఏకంగా 20 పెళ్ళిళ్లు చేసుకోవడమే కాకుండా.. వాళ్లందరినీ మోసం చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన కార్తీక్ రాజా అనే 26 ఏళ్ల వ్యక్తి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఝాన్సీరాణి అనే యువతితో వివాహమయింది. అనంతరం విదేశాలకు వెళ్తున్నానని, త్వరలోనే తననూ తీసుకెళ్తానని నమ్మించాడు. భార్య 5 సవర్ల బంగారాన్ని తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయాడు. నెలలు గడుస్తున్నా భర్తనుంచి ఎలాంటి ఫోన్ రాకపోవటంతో ఝాన్సీకి అనుమమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కార్తీక్ రాజా పై కేసు నమోదు చేసి.. అతను తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుసుకున్నారు.
కార్తీక్ ను అక్కడి నుండి స్టేషన్ కు తీసుకొచ్చి.. విచారణ చేశారు. విచారణలో కార్తీక్ బాగోతమంతా బయటపడింది. తమిళనాడులోని 13 జిల్లాల్లో పలు గ్రామాలకు చెందిన 20 మంది యువతుల్ని పెళ్లాడి.. వారి నుండి కట్నకానుకలు తీసుకుని మోసం చేశానని కార్తీక్ తెలుపగా.. పోలీసులు విస్తుపోయారు. ఝాన్సీ రాణిని 21వ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో అతనిపై మిస్సింగ్, చీటింగ్ కేసులున్నట్లు గుర్తించారు. ఒక్కో అమ్మాయికి ఒక్కో పేరుతో పరిచయమై, వివిధ ఉద్యోగాలు చేసతున్నట్లు నమ్మించి పెళ్లాడినట్లు సమాచారం. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కార్తీక్..ఇలా నిత్యపెళ్లికొడుకు అవతారమెత్తినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి వద్ద నుండి ఆడి కారును స్వాధీనం చేసుకున్నారు. బంగారం, నగదు గురించి ఆరా తీస్తున్నారు.
Next Story