Sun Mar 16 2025 12:33:31 GMT+0000 (Coordinated Universal Time)
తాంత్రికుడిగా నమ్మిస్తూ బాలికపై అత్యాచారం.. బాలిక తల్లి కూడా అరెస్ట్
తివిమ్ ప్రాంతంలోని కాన్సా గ్రామంలో వారిని అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి

తాంత్రికుడిలా నటిస్తూ 50 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నార్త్ గోవాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆ వ్యక్తిని బుధవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో కలిసిపోయి ఈ దారుణానికి సహాయం చేసిన బాధితురాలి తల్లిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 14 ఏళ్ల బాధిత బాలికను సోమవారం తన నివాసానికి పిలిపించి, ఆమె కోరికలన్నీ తీరుస్తాననే నెపంతో అత్యాచారం చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మపుసా) జీవ్బా దాల్వి మాట్లాడుతూ.. నిందితుడితో కలిసిపోయిన 43 ఏళ్ల మైనర్ తల్లిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. బాధితురాలి తండ్రి నిందితులపై ఫిర్యాదు చేయగా అరెస్టులు చేసినట్లు తెలిపారు. తివిమ్ ప్రాంతంలోని కాన్సా గ్రామంలో వారిని అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 376 (రేప్), లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం, గోవా బాలల చట్టం, 2003 కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
News Summary - Man posing as tantrik rapes minor in Goa, girl’s mother held
Next Story