Mon Dec 23 2024 19:29:01 GMT+0000 (Coordinated Universal Time)
వీడియోకాల్ లో సహోద్యోగి భార్యను చూపించలేదని.. కత్తెరతో దాడి
నా భార్యను నువ్వు చూడటం ఏమిటంటూ.. ససేమిరా కుదరదన్నాడు. ఈ విషయమై ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది.
వీడియో కాల్ లో తన సహఉద్యోగి భార్యను చూపించలేదన్న కోపంతో.. అతడిపై మరో ఉద్యోగి కత్తెరతో దాడి చేసి గాయపరిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో ఉన్న ఓ దుస్తుల షాపులో సురేష్(56), రాజేశ్ మిశ్రాలు(49) టైలర్ కమ్ సేల్స్ మెన్లుగా పనిచేస్తున్నారు. సురేశ్ హెచ్ఎస్ఆర్ లేఔట్ లో, రాజేశ్ కోరమంగళ దగ్గర వెంకటాపురలో నివాసముంటారు. డ్యూటీలో ఉండగా.. రాజేశ్ మిశ్రాకు అతని భార్య ఫోన్ కాల్ చేయగా.. అతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన సురేశ్.. రాజేశ్ కి అడ్డు తగిలి నీ భార్యను వీడియో కాల్ చేసి చూపించమని అడిగాడు. అందుకు రాజేశ్ ఒప్పుకోలేదు. నా భార్యను నువ్వు చూడటం ఏమిటంటూ.. ససేమిరా కుదరదన్నాడు. ఈ విషయమై ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేశ్ ఆవేశంతో చేతికి అందిన కత్తెరతో రాజేశ్ పై దాడిచేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో గాయపడిన రాజేశ్ మిశ్రాను ఇతర సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తనపై జరిగిన దాడి గురించి రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సురేశ్ పై ఐపీసీ సెక్షన్ 324, 504 కింద కేసులు నమోదు చేసి, సురేశ్ ను అరెస్ట్ చేశారు.
Next Story