Tue Mar 18 2025 14:35:39 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను నరికిన భర్త కేసు : భయంతో ఆత్మహత్య
గంజి దావీదు విచక్షణ రహిత ధోరణి ముగ్గురు పిల్లల్ని తల్లిదండ్రులు లేని అనాధలను చేసింది. కుటుంబం కోసం కువైట్ వెళ్లిన నిర్మలపై

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దావీదు అనే వ్యక్తి తన భార్య నిర్మలను అత్యంత దారుణంగా హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. మద్యానికి బానిసయిన గంజి దావీదు జంతువు కంటే ఘోరంగా ఉన్మాదిగా మారి భార్యను అత్యంత కిరాతకంగా భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఉదయం భార్యను చంపిన అతను.. పోలీసులకు భయపడి సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గంజి దావీదు విచక్షణ రహిత ధోరణి ముగ్గురు పిల్లల్ని తల్లిదండ్రులు లేని అనాధలను చేసింది. కుటుంబం కోసం కువైట్ వెళ్లిన నిర్మలపై పగతో రగిలిపోయిన దావీదు కన్నకూతుళ్లను చితక్కొట్టి వీడియో వైరల్ చేశాడు. డబ్బు పంపకపోతే పిల్లల్ని చంపేస్తానంటూ కువైట్లో ఉంటున్న భార్యను గతంలో బెదిరించగా.. పోలీసులు జైలుకు పంపారు. ఆ తర్వాత కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చిన నిర్మల.. ముగ్గురు పిల్లలతో కలిసి తన పుట్టింట్లోనే ఉంటోంది. 2 నెలల క్రితం బెయిల్పై రిలీజైన దావీదు తాను మారనని నమ్మబలికాడు. బుద్ధిగా ఉంటానంటూ భార్య ముందు ప్రాధేయపడ్డాడు. బతిమిలాడి మరీ భార్యను 3 రోజుల క్రితం తన ఇంటికి తీసుకొచ్చాడు. మంచిగా నటిస్తూ అదునుచూసి.. ఆమెను దారుణాతి దారుణంగా చంపేశాడు. ఇప్పుడు అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 ఏళ్ల వయసైనా దాటని వారి ఇద్దరు కూతుర్లు, కొడుకు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Next Story