Mon Dec 23 2024 09:43:48 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్‌లో హత్య.. మణిపూర్ వ్యక్తి అరెస్ట్
తుకారాం గేట్ పోలీసులు గత వారంలో చోటు చేసుకున్న కూలీ హత్య కేసులో
తుకారాం గేట్ పోలీసులు గత వారంలో చోటు చేసుకున్న కూలీ హత్య కేసులో బుధవారం నాడు ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి పి నామసుంద్ర (21) గా గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని దిపెందు బిస్వాస్ (23) గా గుర్తించారు. ఇద్దరూ తుకారాం గేట్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వీరు మణిపూర్ కు చెందిన వ్యక్తులు.
గోపాలపురం ఏసీపీ ఎన్.సుధీర్ మాట్లాడుతూ బిశ్వాస్, నమసుంద్ర మణిపూర్ నుంచి నగరానికి వలస వచ్చారు. తుకారాం గేట్లో నివాసం ఉంటూ నిర్మాణ స్థలాల్లో పనిచేశారన్నారు. బిస్వాస్ చావుకు అక్రమ సంబంధమే కారణమని అంటున్నారు. "బిశ్వాస్.. నామసుంద్ర భార్యతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసి అతనిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మద్యం సేవించే నెపంతో నామసుంద్ర జులై 25న తుకారాం గేట్‌లోని నిర్మాణ ప్రదేశానికి బిశ్వాస్‌ను తీసుకెళ్లి అక్కడ హత్య చేశాడు" అని ACP తెలిపారు. రెండు రోజుల తర్వాత స్థానికులు మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో వారు పోలీసులను అప్రమత్తం చేశారు. నిర్మాణ స్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీల సహాయంతో పోలీసులు నామసుంద్రను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు.
Next Story