Sat Dec 21 2024 11:26:30 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ క్యాంప్ పై మావోల దాడి
ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు.
ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు బాంబులతో దాడికి దిగారు. తెలంగాణ ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టలు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన దాడులకు మావోయిస్టులు దిగారు.
అగ్రనాయకులు...
పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారని, ఈ దాడిలో మావోయిస్టు అగ్ర నాయకులు పాల్గొన్నట్లుగా తమ వద్ద సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ క్యాంపు పై ఇంకా మావోయిస్టుల దాడి జరగడంతో దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. మావోల కోత గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story